: కాశ్మీర్ అల్లర్లకు కారణం లష్కరే తోయిబానే!: సంచలన ప్రకటన చేసి పాక్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన హఫీద్ సయీద్
పాకిస్థాన్ స్వయంగా పెంచి పోషించిన ఉగ్రవాద సర్పం విషం కక్కడం ప్రారంభించింది. జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీరులో హిజబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీ మరణం తరువాత చెలరేగిన పెను హింస వెనుక లష్కరే తోయిబా ఉందని అన్నాడు. కాశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణం లష్కరే తోయిబానేనని హఫీజ్ అన్నట్టు తెలిసింది. "కాశ్మీరులో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న చిత్రాలను మీరు చూస్తున్నారా? ఈ ప్రజలందరినీ మోస్తున్నది ఎవరో తెలుసా? అతను లష్కరే తోయిబాకు చెందిన కోటీశ్వరుడు" అని హఫీజ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో కాశ్మీర్ అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉన్నట్టు స్పష్టమవుతోంది.