: ఒబామాపై చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ లో మోదీ!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సాధించిన ఘనతలపై రూపొందించిన ఒక షార్ట్ ఫిల్మ్ ను డెమొక్రాటిక్ పార్టీ కన్వెన్షన్ లో భాగంగా నిన్న చిత్రీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒబామా కలిసి ఉన్న ఒక ఫొటోను ఐదు నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ లో వాడుకున్నారు. ఇది ప్రధాని మోదీకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన ఏకైక విదేశీ నేత మోదీయే! మోదీ కాకుండా బయటి వ్యక్తుల్లో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ బాన్ కీమూన్ కూడా కనిపించనున్నారు. ఒబామా పాలనలో సాధించిన విజయాలను ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రముఖంగా వివరించనున్నారు. ఒబామా పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం నుంచి అల్ ఖైదా చీఫ్ లాడెన్ ను హతమార్చడం వరకు ఉన్న ఎన్నో విషయాలతో పాటు, క్రిస్మస్ క్యారల్స్ పాడిన ఒబామా ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించనున్నారు.

  • Loading...

More Telugu News