: తన స్కూల్ ఫీజుకోసం తండ్రిని వేధిస్తున్నారంటూ విద్యార్థిని ఆత్మహత్య
కార్పొరేట్ స్కూల్ చూపిన ఫీ‘జులుం’ కారణంగా ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థిని ఫీజు చెల్లించలేదంటూ ఆ బాలిక తండ్రిని స్కూలు యాజమాన్యం వేధించింది. త్వరలోనే తన కూతురు ఫీజు చెల్లిస్తానని బాలిక తండ్రి స్కూలు యాజమాన్యానికి చెప్పాడు. అయినా ఫీజు కోసం గడువు ఇవ్వకుండా స్కూలు యాజమాన్యం ఆయనను వేధింపులకు గురిచేసింది. తన వల్లే తన తండ్రి స్కూలు నుంచి వేధింపులకు గురవుతున్నాడని భావించి, తండ్రి బాధను చూడలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు విద్యార్థిని ఆత్మహత్య పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.