: లోక్ సభలో నవ్వులు పూయించిన తెలంగాణ ఎంపీ- కేంద్రమంత్రి సంభాషణ
ఈరోజు లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ల సంభాషణతో సభలో నవ్వులు విరిశాయి. దేశంలో నెలకొన్న నీటి సమస్యపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు. అదే సమయంలో తెలంగాణ ఎంపీ ఒకరు ‘మిషన్ భగీరథ’ కు అదనపు నిధులు ఇవ్వాలని కోరారు. అయితే, సదరు ఎంపీ ఈ విషయం మాట్లాడుతున్న సమయంలో నరేంద్ర సింగ్ తోమర్ కొంత అస్వస్థతతో ఉన్నట్లు కనిపించారు. దీంతో, మంత్రి గారు హుషారుగా లేరంటూ తెలంగాణ ఎంపీ అనడం... డబ్బులు అడిగితే వెంటనే తాను డల్ అయిపోతానని మంత్రి సమాధానం చెప్పడంతో లోక్ సభలో సభ్యులు పూశాయి.