: నేను తేల్చలేనంటూ, హైకోర్టు విభజన కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించిన సీజే
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసులో హైకోర్టు తీర్పు వెలువడుతుందని అందరూ ఆశిస్తున్న వేళ నిరాశే మిగిలింది. కేసును విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్, తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నానని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. హైకోర్టు విభజన తీర్పును సమీక్షించాలని తెలంగాణ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఏపీకి తరలించాలని పట్టుబడుతున్న కేసీఆర్ సర్కారు, ఉమ్మడి హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆప్షన్ విధానాన్ని సాకుగా తీసుకుని ఏపీకి చెందిన న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ, ఇటీవలి కాలంలో న్యాయవాదులు, న్యాయాధికారులూ తీవ్ర నిరసన ఉద్యమానికి తెరలేపిన సంగతి తెలిసిందే.