: పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డులను అందుకున్నాడు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిన్న రాత్రి జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి పవన్ కళ్యాణ్, దేవిశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డులు దక్కడం తనకు చాలా సంతోషంగా ఉందని, తనతో పాటు పనిచేసిన సంగీత కళాకారులు, గాయనీగాయకులకు, తన బృందానికి థ్యాంక్స్ చెప్పాడు. అదేవిధంగా తన సంగీతాన్ని మెచ్చిన శ్రోతలకు కూడా ఆయన కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి, ముమైత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.