: ఎంసెట్-2లో మరో మలుపు... జేఎన్టీయూ ప్రొఫెసర్ హస్తం!
తెలంగాణలో లీకైన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం కేసులో జేఎన్టీయూ ప్రొఫెసర్ హస్తమున్నట్టు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. పేపర్ ను లీక్ చేసిన నిందితులను విచారిస్తున్న వేళ, వారి కాల్ లిస్టును పరిశీలించగా, అందులో ప్రొఫెసర్ నంబర్ ఉంది. దీంతో పాటు మరో ముగ్గురు వర్శిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నంబర్లు కూడా ఉన్నాయి. వీరితో నిందితులు పలుమార్లు మాట్లాడినట్టు తేలడంతో వారిని కూడా విచారించాలని భావిస్తున్నారు. ఓ ప్రశ్నాపత్రం తయారీలో ఈ ప్రొఫెసర్ భాగం పంచుకున్నట్టు తెలుస్తోంది. కాగా, పేపర్ లీకేజీపై నేడు సీఐడి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుండగా, దీన్ని పరిశీలించిన అనంతరం, మరోసారి పరీక్షను నిర్వహించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తీసుకోనుంది.