: పెళ్లి పేరుతో మోసం..బాలికను 50 వేలకు ముంబైలో అమ్మేసిన ప్రబుద్ధుడు


పెళ్లి పేరుతో బాలికను వంచించి ముంబై తీసుకెళ్లి అమ్మేశాడో ప్రబుద్ధుడు. ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఆ బాలిక, తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసలు భరించలేక అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌కు చెందిన బాలిక(14) ఢిల్లీలోని ఓ అనాథాశ్రమంలో ఉంటోంది. ఇటీవల బంధువు ఒకరు ఆమెను తీసుకెళ్లి ఓ వ్యక్తికిచ్చి పెళ్లిచేశాడు. బాలికను వివాహం చేసుకున్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం పేరుతో ముంబై తీసుకెళ్లి ఓ మహిళకు రూ.50వేలకు విక్రయించి పరారయ్యాడు. లింక్‌రోడ్‌లోని మలాడ్ హైరైజ్‌లో నివసిస్తున్న ఓ మహిళకు గత నెలలో తనను విక్రయించినట్టు బాలిక పోలీసులకు తెలిపింది. బిల్డింగ్ గార్డులకు తన విషయాన్ని చెప్పగా వారు పోలీసుల వద్దకు వెళ్లమనడంతో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చినట్టు వివరించింది. తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి రోజూ తనను చిత్రహింసలు పెట్టేవాడని పేర్కొంది. బాలిక ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వదిలిపెట్టేది లేదని జాయింట్ పోలీస్ కమిషనర్ దేవెన్ భారతి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News