: వందలాది చారిత్రక శాసనాలను వెలుగులోకి తెచ్చిన 'హిస్టోరియన్' పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు!
విఖ్యాత చరిత్ర పరిశోధకులు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి కన్నుమూశారు. వందలాది శాసనాలను వెలికితీసి ప్రజలకు గత చరిత్రపై అవగాహన కలిగేలా చేసిన పుణ్య పురుషుడిగా, 95 సంవత్సరాల వయసులో సహజ మరణం పొందిన ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. శాస్త్రి మృతి తెలుగు సాహిత్యానికి తీరనిలోటని అన్నారు. ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. శాతవాహనులు, కాకతీయుల పాలనా విశేషాలు ప్రపంచానికి తెలిశాయంటే, అది ఆయన కృషేనని అన్నారు. పరబ్రహ్మశాస్త్రి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, తన రచనలు, పరిశోధనల ద్వారా శాతవాహనులు తెలుగువారేనని లోకానికి చాటిన ఆయన మరణం తనకు ఎంతో బాధను కలిగించిందని, 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్ర యూనిట్ తరఫున సంతాపం తెలుపుతున్నానని బాలకృష్ణ వివరించారు.