: పెళ్లి కబుర్లు ఇక చాలించు... సమంతకు నాగార్జున షాక్ ట్రీట్‌మెంట్!


పెళ్లి వ్యవహారంపై సోషల్ మీడియాలో ఎడాపెడా పోస్టులు పెట్టడం ఇక ఆపేయాలని టాలీవుడ్ హీరో నాగార్జున... హీరోయిన్ సమంతకు క్లాస్ పీకినట్టు సమాచారం. సమంత, నాగచైతన్యల వివాహంపై దాదాపు రెండు, మూడు నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సమంత కూడా ప్రేమ, పెళ్లి విషయాలను తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తానో ప్రముఖ హీరోని పెళ్లి చేసుకోనున్నట్టు ఆమె పలుమార్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాలన్నీ బయటకు రావడానికి సమంతనే కారణమని భావిస్తున్న నాగార్జున.. ఇక ఈ హంగామాకు ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని భావించారట. సమంతకు ఈ విషయంలో గట్టిగా సలహా ఇచ్చినట్టు టాలీవుడ్ సమాచారం. ‘చాలు. ఇక పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడకు. ఈ విషయంలో ట్వీట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెళ్లి వ్యవహారాన్ని మీడియా హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికైనా ఈ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం మానేస్తే మంచిది. ఇక్కడితో ఈ హంగామా ఆపెయ్’ అని గట్టిగా సూచించినట్టు తెలుస్తోంది. మరి నాగ్ సలహాను ఈ అమ్మడు ఏ మేరకు ఫాలో అవుతుందో చూడాలి!

  • Loading...

More Telugu News