: రేపే నిర్ణయం... ఎంసెట్-2 రద్దు?


తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంసెట్-2 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని నిర్ధారణ అవుతున్న నేపధ్యంలో ఎంసెట్-1 ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో ఆ పరీక్షపై కూడా సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంసెట్-2 పరీక్షాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో ఏం చేయాలి? అన్న దానిపై ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మాల్ ప్రాక్టీస్, లీకేజీల సంఘటనలు, ఆ సందర్భంగా తీసుకున్న చర్యలు, ఇలాంటి నేరాలపై చేసిన చట్టాలపై ఆరాతీశారు. దీంతో పరీక్ష రద్దుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. రేపు సీఐడీ అధికారులు నివేదిక అందజేసిన వెంటనే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేయనివ్వదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News