: బాలీవుడ్ స్టార్స్, ప్రొడక్షన్ హౌస్ లకు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటీసులు


బాలీవుడ్ నటులు, ప్రొడక్షన్ హౌస్ లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఎఫ్సీ) నోటీసులు జారీ చేసింది. అమీర్ ఖాన్, రణ్ వీర్ సింగ్ లాంటి నటులకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు? అంటూ యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలకు సీబీఎఫ్సీ నోటీసులు పంపించింది. అలాగే ఆయా సంస్థల నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో వెల్లడించాలని పలువురు నటులకు కూడా సీబీఎఫ్సీ నోటీసులు జారీ చేసింది. పేరు ప్రఖ్యాతులున్న సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులను ఏరివేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్, అమీర్ ఖాన్, రణ్ వీర్ సింగ్ తదితరులు ఈ నోటీసులు అందుకున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. బాలీవుడ్ లో పన్ను ఎగవేతదారులను గుర్తించే పనిలో సీబీఎఫ్సీ మునిగిపోయిందని ఒక అధికారి తెలిపారు. వారం రోజుల్లో వారి నుంచి సమాచారం కోరే అవకాశం ఉందని ఆ అధికారి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News