: ప్రధాని మోదీ నన్ను చంపేస్తారేమో!: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు


ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీపై ఉన్న అక్కసుతో ప్రధాని మోదీ తనను చంపేస్తారేమోనని ఒక వీడియో మెస్సేజ్ లో కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ ఎమ్మెల్యేలపై మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారని, మోదీ తనను చంపించినా ఆశ్చర్యం లేదంటూ కేజ్రీ వాల్ తీవ్రంగా ఆరోపించారు. యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ వీడియోలో కేజ్రీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతీకారంతో ఉన్న మోదీ, ఆప్ కార్యకర్తలను చంపినా చంపేస్తారేమోనని, ప్రాణాలు పోతాయనే భయం ఉన్నవాళ్లు పార్టీని వీడవచ్చని, లేదంటే జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆప్ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని తాను అనుకోవడం లేదని, ప్రతి ఆప్ కార్యకర్త జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ సూచించారు.

  • Loading...

More Telugu News