: హార్డ్ వర్క్ కు షార్ట్ కట్స్ వుండవు!: విరాట్ కోహ్లీ
హార్డ్ వర్క్ కు షార్ట్ కట్స్ ఉండవని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ అక్కడి జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా చిత్రీకరించిన ఒక వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగానే కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, విండీస్ తో నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 1-0 స్కోరుతో టీమిండియా ఆధిక్యంలో ఉంది.