: ప్రియాంకా చోప్రా చెల్లినని అవకాశాలు రావు... నటనే అవకాశాలు రప్పిస్తుంది: మన్నారా చోప్రా


ప్రియాంకా చోప్రా చెల్లినని చెప్పి తనకు అవకాశాలు ఇవ్వరని 'జక్కన్న' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న మన్నారా చోప్రా తెలిపింది. ఈ సినిమా నిర్మాతలు హిందీలో తాను నటించిన 'జిద్' సినిమా చూశారని, అప్పుడే ఈ సినిమా కథా చర్చలు జరుగుతుండడంతో తనను తీసుకోవాలనుకున్నారని తెలిపింది. 'జక్కన్న' సినిమాలో నటించడం వల్ల సినిమా యూనిట్ తో మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పింది. 8 నెలల పాటు షూటింగ్ జరిగిందని, సుదీర్ఘ కాలం షూటింగ్ జరగడంతో యూనిట్ లోని ప్రతిఒక్కరితో మంచి సంబంధం ఏర్పడిందని తెలిపింది. నిర్మాత, దర్శకుడు, సునీల్ కుటుంబ సభ్యులు కూడా పరిచయమయ్యారని, వారంతా తనకు మంచి స్నేహితులుగా మారారని మననరా తెలిపింది. సినిమా యూనిట్ తో సత్సంబంధాలుండడం వల్ల నటనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పింది. తెలుగు సినీ పరిశ్రమ పని విధానం అద్భుతంగా ఉందని చెప్పింది.

  • Loading...

More Telugu News