: సినీనటి నీతూ అగర్వాల్ భర్త అరెస్ట్
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో సినీ నటి నీతూ అగర్వాల్ భర్త, మస్తాన్ వలిని కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణయ్య మాట్లాడుతూ, కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన మస్తాన్ వలి నల్లమల అటవీ ప్రాంతం నుంచి మారుతీ కారులో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. మస్తాన్ వలితో పాటు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం నాగినేని చెరువుకు చెందిన ప్రధాన స్మగ్లర్ భాస్కర్ ను కూడా అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి ఒక మారుతీ కారు, 26 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్మగ్లర్ మస్తాన్ వలీకి వివిధ రాష్ట్రాలకు చెందిన 90 మంది స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు గుర్తించినట్లు రామకృష్ణయ్య తెలిపారు.