: గజ్వేల్‌లో రైతులతో సమావేశమైన మంత్రి హరీశ్‌రావు
మల్లన్నసాగర్ అంశంపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతోన్న నేపథ్యంలో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని గజ్వేల్‌లో మల్లారెడ్డి గార్డెన్‌లో రైతులతో హరీశ్‌రావు సమావేశమయ్యారు. దీనిలో మల్లన్నసాగర్ ముంపు బాధితులు, పల్లెపహాడ్ రైతులు పాల్గొన్నారు. రైతులతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోస్ కూడా చర్చిస్తున్నారు. మల్లన్నసాగర్ అంశంలో ఇప్పటికే పలు గ్రామాలను ఒప్పించిన హరీశ్‌రావు మిగతా గ్రామాలను కూడా ఒప్పిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.