: కోదండరాం తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు!: తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రైతులే స్వచ్ఛందంగా భూములు ఇస్తుంటే... విపక్షాలు భూసేకరణ అంటూ రాద్దాంతం చేయడం చిత్రంగా ఉందని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేపట్టినా దానిని గుడ్డిగా వ్యతిరేకించడమే తమ పని అన్నట్టు ప్రతిపక్షాలు భావిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేకించడం కోసం తమ సిద్ధాంతాలను కూడా పక్కనబెడుతున్నారని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మాటల్ని పట్టుకుని రాజకీయ జేఏసీ నేత కోదండరాం తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.