: భారత్ లో టీమిండియాపై గెలుపే నా 'బెస్ట్ మూమెంట్'
జొహెన్నెస్ బర్గ్ లో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ తో పాటు మొత్తం ఆరు సీఎస్ఏ అవార్డులను గెలుచుకున్న సందర్భంగా సఫారీ యువ బౌలర్ రబడ మాట్లాడుతూ, భారతగడ్డపై భారత్ పై గెలవడం తన కెరీర్ లో 'బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద క్రికెట్' అని పేర్కొన్నాడు. 2015లో భారత పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ ను గెలుచుకోవడం తన కెరీర్ లోనే గొప్ప అనుభవమని రబడ పేర్కొన్నాడు. 21 ఏళ్ల రబడ 20 వన్డేల్లో 37 వికెట్లు తీసి సత్తా చాటగా, ఆరు టెస్టుల్లో 24 వికెట్లు కూల్చాడు.