: ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు విషయంలో... పార్టీ నుంచి సస్పెండ్ చేసినా వెనక్కి తగ్గనన్న కేవీపీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రేపు చర్చ జరపాలని రాజ్యసభ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ చర్చ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా, తాను రాజ్యసభలో పెట్టిన ప్రత్యేక బిల్లుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయినా బిల్లును ఉపసంహరించుకోబోనని చెప్పారు. రేపు ప్రత్యేక హోదాపై రెండు గంటల పాటు చర్చించాలని బీఏసీలో నిర్ణయించినట్లు కేవీపీ పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, కేవీపీ పెట్టిన హోదా బిల్లును ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ అగ్రనేతలు పేర్కొంటున్నట్లు సమాచారం.