: బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ జార్ఖండ్ లో ప్రత్యక్షం... దేవాలయాలను సందర్శిస్తున్నారంటూ వార్తలు!
ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతిని వేశ్యతో పోల్చి పెను విమర్శలు తెచ్చుకుని, బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన దయాశంకర్ సింగ్, జార్ఖండ్ లోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. గత వారం రోజులుగా ఎవరికీ కనిపించని ఆయన, జార్ఖండ్ లోని దియోగఢ్ దేవాలయంలో కనిపించారని చెబుతూ, దేవాలయ ప్రాంగణంలో ఆయన ఉన్న చిత్రాలను న్యూస్ ఏజన్సీ ఏఎన్ఐ ప్రచురించింది. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నమోదైన కేసులో పోలీసులు దయాశంకర్ ను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి కూడా యూపీ పోలీసులు ఆయన జాడ తెలుసుకోలేకపోయారు. తాజాగా ఆయన జార్ఖండ్ లో ఉన్నట్టు తేలింది.