: ఐశ్వర్యపై బిగ్ బీ కుటుంబం కోపంగా ఉందట!
‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణ్ బీర్ కి జంటగా నటిస్తున్న ఐశ్వర్యా రాయ్ పై బిగ్ బీ కుటుంబం ఆగ్రహంగా ఉందంటూ బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎందుకంటే, కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్ బీర్ తో సన్నిహితంగా ఐష్ నటించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే, రణ్ బీర్ తో సన్నిహితంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని దర్శకుడిని ఐశ్వర్య కోరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి బిగ్ బీ కుటుంబం కోడలితో ముభావంగా ఉంటోందని బాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.