: మహిళా రోగులను లైంగికంగా వేధించిన భారత డాక్టరుకు బ్రిటన్ లో 8 ఏళ్ల జైలు శిక్ష


లండన్ లో బాధ్యతగల గైనకాలజిస్టుగా పనిచేస్తూ, తన వద్దకు వచ్చిన గర్భవతులైన మహిళలను లైంగికంగా వేధించిన మహేశ్ పటవర్థన్ అనే ప్రవాస భారత వైద్యుడికి వూల్ విచ్ క్రౌన్ న్యాయస్థానం ఎనిమిది సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ ప్రాంతంలోని లూయిస్ హామ్ ఏరియా, క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ లో పనిచేసిన మహేశ్, 2008 నుంచి 2012 మధ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళ ఏకంగా ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తనపై వచ్చిన అభియోగాలను మహేశ్ ఖండించినప్పటికీ, లండన్ జీఎంసీ (జనరల్ మెడికల్ అసోసియేషన్) అతని మెంబర్ షిప్ ను రద్దు చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తున్న సమయంలో మహేశ్ భార్య, కుమారుడు, కుమార్తె కూడా కోర్టు హాలులోనే ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News