: విశాఖలో కుప్పకూలిన శిథిల భవనం
విశాఖపట్నంలో కురుస్తోన్న వర్షాలతో వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ఓ శిథిల భవనంలోని ఓ భాగం ఈరోజు కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు వృద్ధులు ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. భవనం కూలుతున్నట్లు శబ్దాలు వినపడగానే వారు బయటకు పరుగులు తీయడంతో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘటనాస్థలికి చేరుకున్న జీవీఎంసీ జోనల్ కమిషనర్.. ఈరోజు సాయంత్రానికల్లా భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని స్థానికులకు తెలిపారు. ఆ భవనంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న శిథిల భవనాలన్నింటినీ త్వరలోనే కూల్చేస్తామని ఆయన చెప్పారు.