: తిరుపతికి బస్సెక్కితే, బస్సులోనే రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్


మీరు అనుకోకుండా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని రావాలని బయలుదేరుతున్నారా? ఏమీ ఫర్వాలేదు. తిరుమలలో ఎంత రద్దీ ఉన్నప్పటికీ, మీకు దర్శనం సులువుగానే అయిపోతుంది. ఇందుకు ఏం చేయాలో తెలుసా? చిత్తూరు జిల్లాలోని ఏ డిపోకు చెందిన బస్సయినా తిరుపతి వెళుతుంటే దాన్ని ఎక్కేయడమే! ఈ నెల 31 నుంచి ప్రయోగాత్మకంగా ఆర్టీసీ, టీటీడీ సంయుక్తంగా అమలు చేయనున్న స్కీమ్ లో భాగంగా, ప్రత్యేక దర్శనం టికెట్లను రిజర్వేషన్ లేదా బస్సులో టికెట్ కొనుగోలు చేసే సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రెండుసార్లు ప్రత్యేక స్లాట్లను కేటాయించి 1000 టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా డిపోల బస్సులు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు సర్వీసులను నడుపుతున్నాయి. అమరావతి, గరుడ, ఇంద్ర, వెన్నెల, సూపర్ లగ్జరీ బస్సుల్లో మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుందని, దర్శనం ఎప్పుడు కావాలన్న విషయాన్ని ముందే వెల్లడించాలని అధికారులు తెలిపారు. ఉదయం స్లాట్ కు 600 టికెట్లు, సాయంత్రం స్లాట్ కు 400 టికెట్లను కేటాయించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News