: వందమందికి మాయదారి రోగాన్ని అంటించాలని చూసిన ప్రబుద్ధుడు!
ఒక హెచ్ఐవీ పేషెంట్ తన రోగాన్ని వందమందికి అంటించాలని చూశాడు. తనకున్న రోగం విషయం గోప్యంగా ఉంచి సుమారు వందమంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆఫ్రికా దేశంలోని మారుమూల గ్రామం మలావీకి చెందిన ఎరిక్ అనీవా (40) అనే వ్యక్తి హెచ్ ఐవీ బాధితుడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అతను అమ్మాయిలు, యువతులు, వితంతవులతో శృంగారంలో పాల్గొనేవాడు. ఈ సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో దేశాధ్యక్షుడి ఆదేశాల ప్రకారం అతన్ని అరెస్టు చేసి విచారణ జరపగా పలు విషయాలు వెల్లడయ్యాయి. రజస్వల అయిన, పాఠశాలలకు వెళ్లే బాలికలతో శృంగారంలో పాల్గొనేవాడినని, ఈవిధంగా చేసినందుకు తనకు వాళ్లు డబ్బులు కూడా ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు. మలావీలో ఉన్న సాంఘిక దురాచారం కారణంగానే అతను ఇంతమందితో శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఎవరూ అడ్డుచెప్పలేదని, అయితే అతను హెచ్ఐవీ బాధితుడనే విషయం రహస్యంగా ఉంచాడని పోలీసులు చెప్పారు. కాగా, అనీవాకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు.