: బెజవాడ విల్సన్, టీఎం కృష్ణలకు ఈ ఏటి 'రామన్ మెగసేసే' పురస్కారాలు


ఈ సంవత్సరపు రామన్ మెగసేసే పురస్కారానికి ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు వ్యవస్థాపక కమిటీ విజేతల పేర్లను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 2016 సంవత్సరానికిగాను కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, తమిళనాడుకు చెందిన కర్ణాటక విద్వాంసుడు టీఎం కృష్ణలను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఓ దళిత కుటుంబంలో పుట్టిన బెజవాడ విల్సన్, బడుగుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. చెన్నైకి చెందిన టీఎం కృష్ణ, తన అద్భుత ప్రతిభతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News