: రేవంత్ రెడ్డికి '420' కష్టాలు!
బాబు పాదయాత్ర ముగింపు సభలో వీరావేశంతో ప్రసంగించిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. సభలో ఆయన మాట్లాడుతూ.. సీబీఐ ఛార్జిషీటులో పేర్లున్న '420' మంత్రులకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా '420' అనక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల విశాఖ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. తమ నాయకుడి పట్ల రేవంత్ అనుచితంగా మాట్లాడడం సహించలేని వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలించిన మీదట తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.