: విపక్షాలపై మండిపడ్డ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
తెలంగాణలోని విపక్షాలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పనితీరును దేశమంతా ప్రశంసిస్తుంటే ఇక్కడి విపక్షాలు మాత్రం కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడమే విపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, ప్రాజెక్టుల విషయంలో విపక్షసభ్యులకు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. దుర్మార్గపు రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని, ఈ విషయాన్ని పక్కనబెట్టి వారిని రెచ్చగొడుతున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.