: గోరక్ష పేరుతో దళితులపై దాడులు చేస్తున్నారు... ఛైర్మన్ పోడియం వద్ద కాంగ్రెస్, బీఎస్పీ సభ్యుల నినాదాలు
'దళితులపై దాడులు’ అంశంపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఈరోజు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఛైర్మన్ పోడియం వద్ద కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు దళితులపై దాడులకు నిరసనగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్రం దళితులపై దాడులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ బీఎస్పీ సభ్యులు డిమాండ్ చేశారు. ‘గోరక్షకు మేం వ్యతిరేకం కాదు’ అని రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే, గోరక్ష పేరుతో దళితులపై దాడులు చేయడం భావ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.