: డైరెక్టర్ క్రిష్ పెళ్లి ముహూర్తం ఖరారు... గోల్కొండ రిసార్ట్స్ లో వివాహం


ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పెళ్లి ముహూర్తం, వేదిక నిర్ణయించారు. ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 2.28 గంటలను పెళ్లి ముహూర్తంగా నిర్ణయించారు. హైదరాబాద్ లోని గండిపేటకు సమీపంలోని గోల్కొండ రిసార్ట్స్ లో క్రిష్, రమ్యల వివాహాం జరగనుంది. డాక్టర్ రమ్యతో గత నెలలో క్రిష్ యంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ప్రముఖ హీరో బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి క్రిష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న క్రిష్, కొంచెం బ్రేక్ ఇచ్చారని.. తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News