: సల్మాన్ కు వ్యతిరేకంగా ఆ పోస్ట్ చేయలేదు: బాలీవుడ్ నటి రేణుకా సహాని
కృష్ణ జింకలను వేటాడిన కేసులో నిర్దోషిగా బయటపడ్డ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు తాను వ్యతిరేకం కాదని నటి రేణుకా సహాని చెప్పింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత రేణుకా సహాని తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ పై సల్లూ భాయ్ అభిమానులు మండిపడుతుండటంతో ఆమె వివరణ ఇచ్చుకోక తప్పలేదు. సల్మాన్ కు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేశానని పొరబడుతున్న అభిమానులు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని, తాను పోస్ట్ చేసిన దానిని పూర్తిగా చదవాలని ఆమె కోరారు. సల్మాన్ ఖాన్ తో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చింది. కోర్టు తీర్పుల్లో జాప్యం జరగకూడదని, నిర్దేశిత సమయంలో తీర్పులు వెలువడాలనే ఉద్దేశంతోనే తాను ఈ పోస్ట్ చేశానని రేణుకా సహాని పేర్కొంది.