: రజనీకాంత్ వినమ్రత చూసి ఆశ్చర్యపోయాను: రిషికపూర్
అమెరికా ఎయిర్ పోర్ట్ లో తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ వినమ్రతను చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ప్రశంసించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్ కు తిరిగి వస్తుండగా అక్కడి ఎయిర్ పోర్టులో తనిఖీ సందర్భంగా రజనీ ఎంతో నమ్రతగా వ్యవహరించారని, ఆయన వినమ్రతను తాను ఎంతో గౌరవిస్తానని రిషికపూర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతేకాకుండా, అమెరికా ఎయిర్ పోర్ట్ లో రజనీకాంత్ ఉన్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.