: పిల్లల అశ్లీల వెబ్ సైట్లు నిర్వహిస్తున్న దంపతుల అరెస్టు
పిల్లల అశ్లీల వెబ్ సైట్లు నిర్వహిస్తున్న చెన్నై దంపతులను సీబీసీఐడీ క్రైం విభాగం పోలీసులు అరెస్టు చేశారు. చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలతో రెండు అశ్లీల వెబ్ సైట్ లను చెన్నై నగరానికి చెందిన సిద్ధార్థ వేలు, అతని భార్య ప్రిస్కిల్లా మార్గరెట్ ధన్ రాజు నిర్వహిస్తున్నారు. చెన్నై కేంద్రంగా సాగుతున్న ఈ వెబ్ సైట్ ల హోస్టింగ్ సాగుతోందని, ఈ వెబ్ సైట్ లు చూడాలంటే సభ్యత్వ రుసుం కూడా వారు తీసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు సభ్యత్వ రుసుం కింద రూ.2.4 కోట్లు వసూలు చేశారని, ఈ వెబ్ సైట్లకు వారి ఈ-మెయిల్ ఐడీలను సైతం లింక్ చేశారనే విషయం తమ దర్యాప్తులో తెలిసిందన్నారు. సభ్యత్వ రుసుం కింద తీసుకున్న డబ్బులు బెంగళూరులోని సిద్ధార్థ వేలు బ్యాంకు ఖాతాలో జమయ్యాయని, ఈ దంపతులపై కేసు నమోదు చేశామని, వారి నుంచి అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.