: హరీశ్ రావు రోడ్లపై వంటలు చేయలేదా?: రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న వేళ, హరీశ్ రావు రహదారులను దిగ్బంధం చేసి వంటలు వండుకుని తినలేదా? వాళ్లు చేస్తే కరెక్ట్, భూములు పోతాయన్న భయంతో ప్రజలు అదే పని చేస్తే తప్పా? అని పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. భూనిర్వాసితుల మహాధర్నాలో పాల్గొని ప్రసంగించిన ఆయన, ప్రాజెక్టుల పేరిట రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భూముల కోసం రైతులను బలవంతపెట్టి సంతకాలు తీసుకుంటే ప్రాజెక్టులు పూర్తికావని ఆయన అన్నారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని, దాన్ని అడ్డుకోరాదని సూచించారు.