: ఒలింపిక్స్ కు దూరమైన రోజర్ ఫెదరర్
వచ్చే నెలలో బ్రెజిల్ లోని రియోలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ పోటీల్లో తాను పాల్గొనబోవడం లేదని స్విస్ టెన్నిస్ స్టార్, 17 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిళ్ల విజేత రోజర్ ఫెదరర్ వెల్లడించాడు. గాయం కారణంగానే తాను రియోకు దూరమవుతున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. కాగా, ఉగ్రదాడుల భయంతో పాటు, జికా వైరస్ బ్రెజిల్ ను వణికిస్తుండగా, ఇప్పటికే పలువురు ప్రముఖ ఆటగాళ్లు ఆటల పోటీలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ పోటీలు జరిగే సమయంలో ఏ క్షణమైనా దాడులు చేసి అపార ప్రాణ నష్టం కలిగిస్తామని ఇప్పటికే ఐఎస్ఐఎస్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను బ్రెజిల్ ప్రభుత్వం చేసింది.