: సికింద్రాబాదులోని ఆర్పీ రోడ్ లో కుప్పకూలిన శిథిల భవనం


సికింద్రాబాదులోని రాష్ట్రపతి రోడ్ లో శిథిల భవనం పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ భవనంలోని సంతోష్ ఎలక్ట్రికల్స్ షాపు యజమాని గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ భవన శిథిలాల కింద మరో వ్యక్తి చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. నేడు కురిసిన భారీ వర్షానికి ఈ భవనం పైకప్పు కూలినట్టు అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News