: వైజాగ్ నుంచి హైదరాబాదు రావాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం
విశాఖపట్టణం నుంచి హైదరాబాదు రావాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్ వేపై నిలిపివేశారు. దీంతో విమానం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికులు ప్రయత్నించగా డోర్లు తెరుచుకోవడం లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. విమానంలో గాయకుడు గజల్ శ్రీనివాస్, పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే విమానంలో సాంకేతిక సమస్యను పరిష్కరించి ప్రయాణికులను హైదరాబాదుకు తీసుకెళ్తామని విమాన సిబ్బంది చెబుతున్నారు. దీంతో హైదరాబాదు నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.