: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!
ఈ మధ్యే గ్రూప్ 2లో అదనంగా ఉద్యోగాల్ని చేరుస్తూ నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురందించింది. వయో పరిమితి సడలింపును మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ సహా అన్ని రకాల పరీక్షలకు గతంలో ప్రభుత్వం పదేళ్ల వయసు సడలించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పొడిగింపు మరో ఏడాది పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.