: రాహుల్ గాంధీని ఇబ్బందుల్లో పడేసిన గుజరాత్ దళితుల పరామర్శ


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చిత్రంగా వివాదాల బారిన పడుతున్నారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా నిద్రపోతూ కెమెరా కళ్లకు చిక్కిన రాహుల్ గాంధీపై బీజేపీ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లోని ఉనా పట్టణంలో దాడికి గురైన దళితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన బాధితులందర్నీ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను హత్తుకుని ఓదార్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రామాబెన్ ముచ్చాదియా (55) అనే మహిళను రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. ఆమెపై హ‌త్యాయ‌త్నం, దోపిడీ, బిల్డ‌ర్‌ కు బెదిరింపులు, ప్ర‌భుత్వ అధికారులను విధి నిర్వ‌హించ‌కుండా అడ్డుకోవడం వంటి పలు కేసులు ఉన్నాయి. దీంతో రాహుల్ పై బీజేపీ విమర్శలు చేస్తోంది. జరిగిన దానిపై ఆమె మాట్లాడుతూ, సాటి ద‌ళితురాలిగా చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌ేందుకు వెళ్లాన‌ని తెలిపింది. బాధితులను చూసి క‌ంటనీరు పెట్టుకుంటున్న సమయంలో రాహుల్ ఓదార్చే ప్రయత్నం చేశారని ఆమె తెలిపింది. దీంతో హంతుకురాలిని హత్తుకుని కౌగిలించుకుంటావా? అంటూ బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమె తప్పుడు పాస్ తో అక్కడికి వచ్చిందని, బాధితురాలిగా భావించి రాహుల్ ఆమెను ఓదార్చారని, ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయవద్దని బీజేపీకి కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. అయినా అలాంటి వారిని కాంగ్రెస్ ఎలా గుర్తిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News