: ఫ్రెండ్ కాబట్టి నీతాకు మోదీ భద్రత కల్పించారు... ఢిల్లీ మహిళల సంగతేంటి?: కేజ్రీవాల్ ప్రశ్న
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి 'వై' కేటగిరి భద్రత కల్పించనున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ మాధ్యమంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్నేహితురాలైనందున ఆమెకు వై కేటగిరీ భద్రత కల్పించారని ఆరోపించారు. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని, ఢిల్లీ మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని కేంద్రం డబ్బున్న వారికి సేవలందించేందుకు తహతహలాడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా నీతాకు వీవీఐపీ భద్రత అంటూ పేపర్ లో వచ్చిన వార్త క్లిప్పింగ్ ఇమేజ్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు.