: హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం
హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి నగరం తడిసి ముద్దైంది. రోడ్లపై నిలిచిన నీటితో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్‌పేట్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, బేగంపేట్, సనత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మల్కాజ్‌గిరి, నేరెడ్‌మెట్, కుషాయిగూడలో మెరుపులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడింది.