: ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రకటనలను నిషేధించాలి: ఎంపీ విప్లవ్ ఠాకూర్
మహిళలను కించపరిచే విధంగా ఉంటున్న ఫెయిర్ నెస్ క్రీంల ప్రకటనలపై నిషేధం విధించాలని కాంగ్రెస్ ఎంపీ విప్లవ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఈరోజు రాజ్యసభ జీరో అవర్ లో ఈ అంశంపై ఆమె మాట్లాడారు. ఫెయిర్ నెస్ క్రీంలు, సౌందర్య సాధనాల సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం మహిళలను కించపరిచేలా ప్రకటనలను రూపొందిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇటువంటి ప్రకటనల ద్వారా మహిళలు ఆత్మన్యూనతా భావానికి లోనయ్యే అవకాశముందన్నారు. అటువంటి ప్రకటనలను వెంటనే నిలిపివేయాలన్నారు.