: మనీ బిల్లు అన్నది పెద్ద సాకు... ఏపీని బీజేపీ దారుణంగా మోసగించింది!: కేవీపీ


ఏపీని బీజేపీ సమాధి చేయాలని భావిస్తోందని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటూ రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రతిపాదించిన ఏడాది తరువాత ఈ బిల్లు మనీ బిల్లు అన్న సంగతి బీజేపీకి తెలిసిందా? అని నిలదీశారు. ఏపీకి బీజేపీ కుట్రపూరితంగా అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. బిల్లును మనీ బిల్లు అంటూ వక్రభాష్యం చెప్పడం ద్వారా బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ కుయుక్తులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేశామని, బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రకటించడం ద్వారా ఈ బిల్లును రాజ్యసభలో ఓటింగ్ కు రాకుండా బీజేపీ అడ్డుకోగలిగిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News