: తన సోదరుడికి శిక్ష విధించిన జడ్జిపై సోదరి దాడి
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఓ క్రిమినల్ కేసులో అనిత అనే మహిళ సోదరుడు, ఇతర నిందితులను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మీరట్ అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిని కలిసేందుకు అనిత అనుమతి లేకుండానే జడ్జి చాంబర్ లోకి వెళ్లింది. వెళ్తూనే జడ్జిని దూషించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జడ్జిపై వాటర్ బాటిల్ విసిరింది. ఆమెను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ పై అక్కడున్న ఛైర్ విసిరింది. దీంతో ఆమె గాయపడింది. ఇతర సిబ్బంది వచ్చి అమెను అడ్డుకున్నారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసినట్టు మీరట్ పోలీసులు తెలిపారు.