: ఇతర పార్టీలను బలహీనపరచి అస్థిరపరచాలని చూస్తున్నారు: జానారెడ్డి
లాఠీ దెబ్బలు తిన్న మల్లన్నసాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళుతోన్న తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబించడం మానేయాలని సూచించారు. ఇతర పార్టీలను బలహీనపరచి అస్థిరపరచాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్ వద్దే కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని అరెస్టు చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. వేములఘాట్ బాధితులను పరామర్శించడం శాంతి భద్రతలకు విఘాతం కాదని ఆయన అన్నారు.