: 'పోకేమాన్ గో' అంతు చూసిన తొలి వ్యక్తి!


ప్రపంచంలోని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను వైరస్ లా పట్టి పీడిస్తున్న 'పోకేమాన్ గో' ఆటలో తుది వరకూ వెళ్లిపోయాడో అమెరికన్. అమెరికాలో ఈ గేమ్ మొట్ట మొదటగా విడుదల కాగా, ట్విట్టర్, టిండర్ తదితర యాప్ లకన్నా అధిక డౌన్ లోడ్లను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక బ్లూక్లిన్ కు చెందిన నిక్ జాన్సన్, తాను అమెరికాలో అందుబాటులో ఉన్న 142 పోకేమాన్ లనూ పట్టేసుకున్నానని చెబుతూ సామాజిక మాధ్యమం రెడ్డిట్ లో ఓ పోస్టు పెట్టాడు. యాప్ లోని 'పోకేడెక్స్' సెక్షన్లో తాను పట్టుకున్న 142 పోకేమాన్ లనూ చూపించాడు. వాస్తవానికి ఈ గేమ్ లో మరో 11 పోకేమాన్ లు ఉంటాయట. ఈ 11లో మిస్టర్ మైమ్, కంగష్ ఖాన్, ఫార్ ఫెచ్డ్ అనే పేరున్న పోకేమాన్ లను ఇతర దేశాల్లో పట్టి బంధించాలి. మిగిలిన ఆరు పోకేమాన్ లూ ఎక్కడ ఉంటాయో ఇంకా గేమ్ ను తయారు చేసిన నింటెండోనే ప్రకటించలేదు. తాను ఈ పోకేమాన్ లను రోజుకు 8 గంటల పాటు శ్రమించి మన్ హట్టన్, బ్రూక్లిన్ ప్రాంతాల్లో వెతికి పట్టుకున్నట్టు నిక్ జాన్సన్ 'బిజినెస్ ఇన్ సైడర్' పత్రికకు వెల్లడించాడు. సరాసరిన రోజుకు 8 మైళ్లు నడుస్తూ, రెండు వారాల పాటు శ్రమించానని చెప్పాడు. తన తొలి పోకేమాన్ 'స్క్వయిర్టిల్' అని, చివరిగా తాను 'ఒమాస్టార్'ను పట్టుకున్నానని చెప్పాడు. ఓ పోకేమాన్ కోసం న్యూయార్క్ కూడా ప్రయాణించానని తెలిపాడు. ఇప్పుడిక ఇతర దేశాల్లో ఉన్న పోకేమాన్ ల కోసం ట్రావెల్ సైట్లను స్పాన్సర్ చేయాలని సంప్రదిస్తున్నట్టు వెల్లడించాడు.

  • Loading...

More Telugu News