: ఆందోళనల నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా
రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై ఓటింగ్ కు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. దీనికి డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ నేతలు పోడియంను చుట్టుముట్టి, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. కాంగ్రెస్ నేతల నినాదాల నడుమ సభ సజావుగా సాగకపోవడంతో ఉదయం వాయిదా పడ్డ రాజ్యసభ రెండోసారి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. చివరకు అధికార పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ద్రవ్యబిల్లు అని, దానిని రాజ్యసభలో చర్చించడం తగదని చెప్పడంతో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. దీంతో రేపు ఉదయానికి రాజ్యసభను వాయిదా వేస్తూ డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.