: ఏపీ ప్రత్యేకహోదాను తేల్చండి...గత ప్రధాని ఇక్కడే ప్రకటించారు!: సీతారాం ఏచూరి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టుబట్టింది. దీంతో పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు నినాదాలతో రాజ్యసభను హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇది రాజ్యసభ రూల్స్ కు విరుద్ధమని చెప్పిన డిప్యూటీ ఛైర్మన్ కురియన్, ఈ శుక్రవారం చర్చకు తీసుకువద్దామని అన్నారు. దానికి అంగీకరించని కాంగ్రెస్ నేతలు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కురియన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి మధ్య ఆసక్తికర వాదన చోటుచేసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి ఆందోళన విధానం కాదని అన్నారు. వచ్చే శుక్రవారం దీనిపై చర్చ, ఓటింగ్ పెడదామని అన్నారు. దీనిపై సీతారాం ఏచూరి మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తున్నట్టు గతంలో ప్రధాని ఇక్కడే ప్రకటించారని, దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని, అధికార పార్టీని అందుకు ఆదేశించాలని ఆయన సూచించారు. రూల్స్ ప్రకారం ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగలేదని, అందుకే ప్రస్తుతం ఈ ఆందోళన అని ఆయన చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు మళ్లీ నినాదాలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News