: 'ఇంటరాగేషన్ వేస్ట్, నా పేరు గూగుల్ లో వెతికి చూడండి'... పోలీసులతో 22 మందిని చంపిన ఆర్జేడీ నేత కుమారుడు


"నన్ను ఇంటరాగేషన్ చేసి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. గూగుల్ కు వెళ్లి 'సైకో కిల్లర్ అమిత్' అని వెతికి చూడండి. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుస్తుంది"... పోలీసులే విస్తుపోయేలా ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? బీహార్ లో ఆర్జేడీ మాజీ ఎంఎల్సీ లలన్ శ్రీవాత్సవ్ కుమారుడు, ఉన్నత విద్యను అభ్యసించి ఆపై ఉన్మాదిగా మారిన 35 ఏళ్ల అవినాష్ శ్రీవాత్సవ్ అలియాస్ అమిత్ చెప్పిన మాటలివి. వైశాలీ జిల్లాలో ఓ బ్యాంకును లూటీ చేసేందుకు వెళ్లిన అమిత్ ను స్థానికులు ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులతో అమిత్ ఆ విధంగా చెప్పాడు. వైశాలి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 22 మందిని దారుణంగా అమిత్ హతమార్చిన ఆరోపణలు ఉన్నాయి. తన తండ్రి లలన్ ను పప్పూ ఖాన్ వర్గం హత్య చేయిస్తే, ఆ ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు కూడా. పప్పూను వెంబడించి 32 తూటాలతో అతని శరీరాన్ని తూట్లు పడేలా కాల్చాడు అమిత్. ఆపై సీరియల్ కిల్లర్ గా మారి, లలన్ హత్యతో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురితో పాటు మరో 15 మందిని దారుణంగా చంపేశాడు. బాలీవుడ్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ వసియాపూర్-2' క్లైమాక్స్ తనకు ప్రేరణగా చెప్పుకునే అమిత్, ఈ సంవత్సరం మార్చిలో బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అతన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News